అపరిచితుడికి హగ్ ఇచ్చిన సమంత !

అపరిచితుడికి హగ్ ఇచ్చిన సమంత !

సమంత మొదటిసారి తనకు అసలు పరిచయమే లేని ఒక అపరిచితుడ్ని కౌగిలించుకున్నారట.  ఆ అపరిచితుడే ఈ నెల 7న విడుదలకానున్న 'కేరాఫ్ కంచరపాలెం' చిత్ర దర్శకుడు మహా వెంకటేష్.  సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా రిలీజ్ కానున్న ఈ సినిమాపై మొదటి నుండి మంచి హైప్ ఉంది. 

దానికి తోడు గత కొన్ని రోజులుగా వరుసగా సెలబ్రిటీలకు షోలు వేస్తూ వారి స్పందనను కూడ తెలుసుకుంటున్నారు.  అందులో భాగంగానే సమంత నిన్న ఈ సినిమాను వీక్షించారు.  ఈ చిత్రం ఆమెకు చాలా బాగా నచ్చిందట.  అందుకే దర్శకుడ్ని అభినందిస్తూ ఆలింగనం చేసుకున్నారట.