ప్రెగ్నెన్సీ రూమర్లపై సమంత ఏమందంటే

ప్రెగ్నెన్సీ రూమర్లపై సమంత ఏమందంటే

సమంత అక్కినేని సినిమా ప్రమోషన్లలో భాగంగా తన ట్విట్టర్ ఐడీని బేబీ అక్కినేనిగా మార్చడంతో కొందరు నెటిజన్లు సమంత తల్లి  కాబోతోందని, అందుకే ఐడీలో బేబీ అని చేర్చిందని ఎవరికీ వారే అనేసుకున్నారు.  దీంతో సోషల్ మీడియాలో సమంత తల్లి కానుందననే పుకార్లు తారాస్థాయికి చేరుకున్నాయి.  చివరికి సమంత వరకు కూడా వెళ్లాయి.  కానీ ఆమె మాత్రం వాటిని చాలా ఈజీగా తీసుకున్నారు.  అవునా.. ఆవిడ తల్లి కానుందా..? మీకు తెలిస్తే మాకు చెప్పండి అంటూ సరదాగా స్పందించారు.  ప్రస్తుతం సమంత 'ఓ బేబీ' పనుల్లో బిజీగా ఉన్నారు.