సమంత ఆ సైలెన్స్ ను బ్రేక్ చేసింది..!!

సమంత ఆ సైలెన్స్ ను బ్రేక్ చేసింది..!!

సమంత ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.  పెళ్లి కాక ముందు ఆమెకు అవకాశాల సంగతి ఎలా ఉన్నా.. పెళ్ళైన తరువాత వరస విజయాలతో దూసుకుపోతున్నది.  హీరోయిన్లకు పెళ్లి తరువాత అవకాశాలు తగ్గిపోతాయని, వారు సినిమా జీవితం నుంచి తప్పుకుంటారని వచ్చిన, వస్తున్న వార్తలకు చెక్ పెట్టేందుకు కసితో సినిమాల్లో నటిస్తూ రాణిస్తుందట.  హీరోయిన్ కు పెళ్లయిందా.. పెళ్లి తరువాత సినిమాల్లో నటిస్తుందా అని పట్టించుకోరని, హీరోయిన్ గా ఆమె ఎలాంటి పెర్ఫార్మన్స్ చేస్తున్నది అన్నది మాత్రమే చూస్తారని, సినిమా ఇండస్ట్రీలో పెళ్ళైన హీరోయిన్లకు అవకాశాలు రావనే భావన నుంచి బయటకు రావాలని సమంత అంటోంది.  నటనను ఛాలెంజ్ గా తీసుకొని నటిస్తే.. ఎలాంటి పాత్రలోనైనా రాణిస్తారని సమంత చెప్తున్నది.  ప్రస్తుతం సమంత యూ టర్న్, సీమరాజా చిత్రాలు విడుదలకు రెడీగా ఉన్నాయి.  ఈ సినిమాల తరువాత భర్త నాగచైతన్యతో "మజిలీ" కి రెడీ అవుతున్నది.