ఆటోలో సమంత హల్చల్

ఆటోలో సమంత హల్చల్

అక్కినేని వారి కోడలు సమంత వరస విజయాలతో దూసుకుపోతున్నది. రంగస్థలం, మహానటి, ఇరుంబు తిరై చిత్రాలు హిట్ కావడంతో సమంత మంచి జోరు మీదున్నది.  హ్యాట్రిక్ విజయంతో దూసుకుపోతున్న సమంత ఇప్పుడు యూటర్న్ సినిమాలో నటిస్తున్నది.  కన్నడంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్నారు.  ఇటీవలే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది.  కన్నడంలో దర్శకత్వం వహించిన పవన్ కుమార్ తెలుగు, తమిళ సినిమాలకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ సమయంలో సమంత టీమ్ తో కలిసి ఆటోలో కూర్చున్న  ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రేండింగ్ అవుతున్నది.