ఆ సినిమాలో సమంత 70 ఏళ్ళ వృద్దురాలిగా కనిపిస్తుందా..?

ఆ సినిమాలో సమంత 70 ఏళ్ళ వృద్దురాలిగా కనిపిస్తుందా..?

ఎవరూ చేయని కొత్త కొత్త పాత్రలను ఎంచుకొని ఆ పాత్రలో ఒదిగిపోయి నటిస్తూ.. మంచి పేరు తెచ్చుకుంటున్న హీరోయిన్లలో సమంత కూడా ఒకరు. వివాహం తరువాత కూడా సమంత హిట్ మూవీస్ లో నటిస్తూ దూసుకుపోతున్నది.  ఈ ఏడాది ఆమె నటించిన మూడు సినిమాలు హిట్ అయ్యాయి.  ఇప్పుడు యూటర్న్, నాగ చైతన్యతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  

రాజుగారి గది 2, రంగస్థలం, మహానటి వంటి ప్రయోగాత్మక సినిమాల్లో నటించిన సమంత ఆయా పాత్రలకు ప్రాణం పోసింది.  ఇలాంటి మరో ప్రయోగాత్మక సినిమాలో సమంత 70 సంవత్సరాల వృద్దురాలిగా కనిపించబోతున్నదట.  హాలీవుడ్ తరహాలో ఈ సినిమా ఉండబోతున్నదట.  70 సంవత్సరాల వృద్దురాలిగా ఉన్న సమంత.. ఓ ఫోటో స్టూడియోకు వెళ్ళగానే 20 సంవత్సరాల యువతిగా మారిపోతుందట. కొరియా సినిమా మిస్  గ్రానీని స్ఫూర్తిగా తీసుకొని ఈ కథ తయారు చేస్తున్నట్టు తెలుస్తున్నది.  ఈ సినిమాకు సంబంధించి సమంతతో కథాచర్చలు జరుపుతున్నారట దర్శకులు.   ఇంతకీ ఈ సినిమా దర్శకులు ఎవరు అనే విషయం చెప్పనే లేదు కదూ.  అదెవరో కాదు నందిని రెడ్డినే.   గతంలో నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత జబర్దస్త్ అనే సినిమాలో నటించింది.    బ్లాక్ అండ్ వైట్  కాలంలోఇలాంటి సినిమాలు వస్తుండేవి.  అరుంధతి నుంచి మరలా మైథలాజికల్ సినిమాలు రావడం మొదలుపెట్టాయి.  థ్రిల్లింగ్ కలిగించే గ్రాఫిక్స్ తో రూపొందుతున్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ వస్తుండటంతో ఎక్కువమంది ఇలాంటి కథలపైనే దృష్టి సారిస్తున్నారు.  పాత సీసాకు కొత్త హంగులు తీసుకురావడం అంటే ఇదేనేమో.