సమంత...ద ట్యాక్సీ డ్రైవర్!

సమంత...ద ట్యాక్సీ డ్రైవర్!

సమంత సినిమాల విషయంలో నిన్నటి వరకు ఓ న్యూస్ హల్చల్ చేసింది.  త్వరలోనే ఆమె సినిమాలకు స్వస్తి పలకపోబోతున్నట్టు వార్తలు వచ్చాయి.  ఈ వార్తలపై సమంత స్పందించకబోయినా.. ఆమె భర్త నాగచైతన్య స్పందించాడు.  సమంత సినిమాలకు స్వస్తిపలుకుందని వస్తున్న వార్తల్లో నిజం లేదని, వివాహం తరువాత సినిమాల్లో నటించే అవకాశాలు సమంతకు పెరిగాయని, ఈ సమయంలో సమంత సినిమాలు ఎలా ఆపేస్తుందని ప్రశ్నించారు.  

ప్రస్తుతం సమంత తెలుగులో యు టర్న్, తమిళంలో సీమరాజా సినిమాల్లో నటిస్తోంది.  ఇవి త్వరలోనే విడుదల కాబోతున్నాయి.  దీని తరువాత భర్త నాగ చైతన్యతో కలిసి ఓ సినిమాచేయబోతున్నది.  ఇదిలా ఉంటె, ఇప్పుడు మరో న్యూస్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.  అదేమంటే,  అర్జున్ రెడ్డి దర్శకుడు  సందీప్ రెడ్డి వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన గిరిసయ్య దర్శకత్వంలో సమంత ఓ హాలీవుడ్ తరహా  సినిమాలో నటించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.  

హాలీవుడ్ సూపర్ హిట్టైన కొలాటేరల్ సినిమాలోని పాత్రల ఆధారంగా ఓ కథను తయారు చేసుకున్నాడట గిరిసయ్య.  హాలీవుడ్ సినిమాలో టామ్ క్రూయిజ్ హీరోగా నటించాడు.  కాగా, టామ్ క్రూయిజ్ పోషించిన టాక్సీ డ్రైవర్ పాత్రను సమంత చేస్తుందట.   కొలాటేరల్  స్ఫూర్తితో రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ  మేరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.