సమంత ఇష్టపడి చేసిన సినిమా విడుదల ఎప్పుడంటే !

సమంత ఇష్టపడి చేసిన సినిమా విడుదల ఎప్పుడంటే !

సమంత అక్కినేని ఎంతో ఇష్టంగా చేసిన చిత్రం 'యు టర్న్'.  2106 లో కన్నడలో ఘన విజయం సాధించిన 'యు టర్న్' చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా రూపొందుతోంది.  కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను సమంత విడుదలచేశారు.  

మిస్టీరియస్ గా కనిపిస్తున్న ఆ పోస్టర్ చూస్తుంటే సినిమా మంచి థ్రిల్లింగ్ కంటెంట్ తో రూపొందినట్టు అనిపిస్తోంది.  సమంత కూడ ఈ సినిమా విజయంపై గట్టి నమ్మకంతో ఉన్నారు.   అది పినిశెట్టి , రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఆగష్టు 13న తెలుగు, తమిళంలో రెండు భాషల్లోను విడుదలకానుంది.  పవన్ కుమార్ దర్శకత్వం శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ సంస్థ నిర్మిస్తోంది.