మొదటిసారి సమంత.. వావ్ సూపర్..

మొదటిసారి సమంత.. వావ్  సూపర్..

సమంత బెస్ట్ యాక్టర్ అనే విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.  తన నటనతో మెస్మరైజ్ చేస్తుంది. టాలీవుడ్ లో తన మొదటి సినిమా ఏం మాయ చేశావే దగ్గరి నుంచి ఇప్పటి వరకు ప్రతి సినిమాలో పరిణితి కనిపిస్తూ నటిస్తూ వచ్చింది.  ఇప్పుడు సమంత నటిస్తున్న యూటర్న్ సినిమాలో మొదటిసారిగా సమంత తన పాత్రకు డబ్బింగ్ చెప్పింది.  ఇప్పటి వరకు సమంతకు చిన్మయి వాయిస్ ఇచ్చేది.  

మొదటిసారి సమంత చేసిన ప్రయత్నం బాగానే ఉంది.  తన సినిమాకు తాను డబ్బింగ్ చెప్పుకోవాలనే ప్రయత్నం మంచిదే.  కీర్తి సురేష్ వంటి హీరోయిన్లు కొద్దీ రోజుల్లోనే తెలుగు నేర్చుకొని తన సినిమాకు తాను డబ్బింగ్ చెప్పుకుంటున్నది.  సమంత చెప్పుకోవడంలో తప్పేమి లేదు.  కాకపోతే, వాయిస్ సెట్ కావాలి కదా.  సమంత వాయిస్ మరీ పీలగా ఉంది.  ట్రైలర్ తరువాత ఎలాగో ఫీడ్ బ్యాక్ వస్తుంది కాబట్టి వాయిస్ లో చేంజెస్ చేసుకోవడమా లేదంటే.. చిన్మయితోనే డబ్బింగ్ చెప్పించడమా అన్నది తేలాలి.