మరోసారి హాట్ టాపిక్ గా మారిన సమంత..!!

మరోసారి హాట్ టాపిక్ గా మారిన సమంత..!!

అక్కినేని సమంతకు 2018 వ సంవత్సరం బాగా కలిసి వచ్చింది.  ఈ ఏడాది మొదట్లో ఆమె నటించిన మూడు సినిమాలు విడుదలయ్యాయి.  ఈ మూడు సూపర్ హిట్ అయ్యాయి.  రంగస్థలం టాలీవుడ్ లో నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసింది.  మహానటిలో క్యారెక్టర్ చిన్నదే అయినప్పటికీ ఆ సినిమాలోని జర్నలిస్ట్ పాత్రకు ప్రాణం పోసింది.  అభిమన్యుడులో సైక్రియాట్రిస్ట్ డాక్టర్ రతీదేవి పాత్రలో మెప్పియించింది.  ఈ మూడు సూపర్ హిట్ కావడంతో మరోసారి టాప్ హీరోయిన్ గా నిరూపించుకున్నది.  

ఇప్పుడు సమంత మూడు సినిమాలు చేస్తున్నది.  ఒకటి యూ టర్న్, రెండోది సీమరాజ, మూడో సినిమా భర్త నాగచైతన్యతో.  ఇందులో మొదటి రెండు సినిమాల షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  మూడో సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభమౌతుంది.  సమంత నటిస్తున్న యుటర్న్, సీమరాజా సినిమాలు సెప్టెంబర్ 13 న విడుదల కాబోతున్నాయి. ఇది సమంతకు థ్రిల్లింగ్ కలిగించే అంశమనే చెప్పాలి.  ఎందుకంటే ఒక స్టార్ నటించిన సినిమా ఒకేరోజున విడుదల కావడం చాలా రేర్ గా జరుగుతుంటుంది.  అప్పుడెప్పుడో బాలకృష్ణ నటించిన నిప్పురవ్వ, బంగారు బుల్లోడు సినిమాలు ఒకేరోజున విడుదలయ్యాయి.  అందులో నిప్పురవ్వ ప్లాప్ అవ్వగా, బంగారు బుల్లోడు హిట్ అయింది.  మరిప్పుడు సమంత నటిస్తున్న రెండు సినిమాల్లో ఏ సినిమా హిట్ అవుతుందో చూడాలి.  యుటర్న్ సినిమా హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో ఉంటె, సీమరాజా మాత్రం పూర్తిగా మాస్ సినిమా.  తమిళనేటివిటికి తగ్గట్టుగా సినిమా రూపొందుతుంది.  రెండు సినిమాలపైనే సమంత కాన్ఫిడెన్స్ గా ఉన్నది.  మరి ఎలా జరుగుతుందో చూద్దాం.