మరోసారి విజయ్ తో సమంత..!!

మరోసారి విజయ్ తో సమంత..!!

సమంత పెళ్లి తరువాత కూడా భారీ ఆఫర్లతో దూసుకుపోతున్నది.  సినిమాలను సెలెక్టివ్ గా ఎంచుకుంటూ.. సినిమాలు చేస్తున్నది.  మరోవైపు వరస బ్రాండ్లతో రెండు చేతులా సంపాదిస్తున్న ఈ అమ్మడు ఇప్పుడు విజయ్ దేవరకొండతో మరోసారి కలిసి నటించబోతున్నది.  మహానటి సినిమాలో ఈ ఇద్దరు కలిసి నటించారు.  ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా తక్కువైనా చాలాబాగా నటించారు.  

కాగా, ఇప్పుడు మరలా ఇద్దరు కలిసి నటించబోతున్నారు.  ఇది సినిమాలో కాదండోయ్.. ఇ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కోసం.  ఫ్లిప్ కార్ట్ సంస్థ ఇయర్ ఎండింగ్ ఆఫర్లతో చెలరేగిపోతున్నది.  అమ్మకాలను మరింతగా పెంచుకునేందుకు వీరిద్దరిని ప్రచార కర్తలుగా తీసుకున్నారట.