ఆమ్మో అమ్మాయేనా.. ఎల్లోరా శిల్పమా..!!

ఆమ్మో అమ్మాయేనా.. ఎల్లోరా శిల్పమా..!!

అందం అమ్మాయైతే.. నీలా ఉంటుందే అని మన సినీ కవులు అమ్మాయిల అందం గురించి పొగుడుతూ ఎన్నో పాటలు రాశారు.  ఆ పాటలాంటి అందానికి పర్ఫెక్ట్ ఉదాహరణ ఎవరు అంటే.. సమంత అని చెప్పాలి.  పెళ్లి తరువాత కూడా సమంత సినిమాల్లో యాక్ట్ చేస్తూ టాప్ నటిగా దూసుకుపోతున్నది.  వివాహం తరువాత గతేడాది వరసగా సినిమాలు చేసి విజయం సాధించింది.  ఈ సంవత్సరం కూడా అదే ఊపును కొనసాగించేందుకు సిద్ధమైంది సమంత.  

భర్త నాగచైతన్యతో కలిసి మజిలీ చేస్తున్నది.  ఈ సినిమా షూటింగ్ శెరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే.  సమ్మర్ స్పెషల్ గా సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.  ఇందులో మధ్యతరగతి మహిళగా కనిపిస్తోంది సమంత.  ఇదిలా ఉంటె, సమంత రీసెంట్ గా బ్లాక్ అండ్ బ్లాక్ నెట్ డ్రెస్ లో ఫోటో షూట్ చేసింది.  ఈ ఫోటో షూట్ లో సమంత అచ్చంగా ఎల్లోరా శిల్పంలా ఉండటం విశేషం.  సమంత బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండటం విశేషం.