అవన్నీ పుకార్లే అంటోన్న సమంత

అవన్నీ పుకార్లే అంటోన్న సమంత

సమంత వివాహం తరువాత కూడా హీరోయిన్ గా చాలా బిజీగా మారిపోయింది.  గతేడాది వరసగా విజయాలను అందుకున్న సమంత ఈ సంవత్సరం కూడా మజిలీతో భారీ హిట్ కొట్టింది.  నాగచైతన్య కెరీర్లో హయ్యస్ట్ వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.  ప్రస్తుతం నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ బేబీ సినిమా చేస్తున్నది.  

వీటిని పక్కన పెడితే... సమంతకు ఆమె తల్లికి పెద్దగా పడటం లేదని అందుకే ఆమెను దూరంగా పెట్టిందని వార్తలు వస్తున్నాయి.  ఈ వార్తలపై సమంత తనదైన శైలిలో స్పందించింది.  తనకు అమ్మ అంటే చాలా ఇష్టం అని చిన్నప్పటి నుంచి తనకోసం ప్రార్ధనలు చేసేదని, తనకు ఎలాంటి అవసరం ఉన్నా అమ్మే చూసుకునేదని చెప్పింది.  అమ్మ రెండో దేవత అని అలాంటి అమ్మకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటానని అంటోంది.  అక్కడితో ఆగకుండా తన తల్లి ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.