అద్భుతాలు చేయబోతున్న సమంత..

అద్భుతాలు చేయబోతున్న సమంత..

అక్కినేని సమంత వివాహం తరువాత స్పీడ్ పెంచింది.  వరసగా సినిమాలు చేస్తూ.. హిట్స్ కొడుతూ దూసుకుపోతున్నది.  రంగస్థలం, మహానటి, అభిమన్యుడు, యూటర్న్ వంటి సినిమాలతో హిట్స్ కొట్టిన సమంత.. మరికొన్ని సినిమాలు చేసేందుకు సిద్ధమైంది.  నాగ చైతన్యతో మజిలీ చేస్తున్న సమంత నందిని రెడ్డి సినిమాలో గ్రానీగా కనిపించబోతున్నది.  

కొరియన్ డ్రామా సినిమా మిస్ గ్రానీ సినిమా ఇన్స్పిరేషన్ తో నందిని రెడ్డి ఓ అద్భుతమైన కథను రెడీ చేసుకున్నారు.  ఈ కథ సమంతకు నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసిందట.  ఇందులో సమంత 60 సంవత్సరాల బామ్మగా కనిపిస్తుంది.  కథను నేరేట్ చేసే సమయంలో సడెన్ గా యంగ్ గా మారిపోతుంది. అద్భుతమైన కథనాలతో సినిమా ఆకట్టుకునే విధంగా ఉండబోతుందని సమాచారం.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.  వచ్చే ఏడాది జనవరి నుంచి సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుందని సమాచారం.