సమంత ఆ విషయంలో చాలా టెన్షన్ పడిందట

సమంత ఆ విషయంలో చాలా టెన్షన్ పడిందట

సమంత తన జీవితంలో నాగచైతన్యకు ఎంత ప్రాముఖ్యతను ఇస్తుందో చెప్పక్కర్లేదు.  భర్తతో కలిసి చేసిన మజిలీ సినిమాలో ఆమె నటన అందుకు ఓ నిదర్శనం అని చెప్పొచ్చు.  గతంలో సమంత చేసిన సినిమాలతో పోలిస్తే.. మజిలీలో ఆమె నటన అద్భుతం అని చెప్పాలి.  అటు నాగచైతన్య కూడా ఈ సినిమాలో జీవించేశాడు.  పాత్రకు ప్రాణం పోశాడు.  

ఈ రెండు విషయాలు పక్కన పెడితే.. సమంత కొన్ని విషయాల్లో చాలా టెన్షన్ పడిందట.  అలాంటి వాటిల్లో ఒకటి పెళ్లి చీర.  పెళ్లి చీర తన లైఫ్ లో చాలా స్పెషల్ అని చెప్పిన సమంత... దానిని డ్రై వాష్ కు ఇచ్చిన తరువాత చాలా టెన్షన్ పడిందట.  ఎలా డ్రై వాష్ చేస్తారో..డ్యామేజ్ అవుతుందేమో అని భయపడినట్టు సమంత చెప్పింది.  

డ్రై వాష్ నుంచి తిరిగి వచ్చాక.. చీర మొత్తాన్ని చెక్ చేసుకొని ఊపిరి పీల్చుకున్నట్టు సమంత స్వయంగా చెప్పింది.