కోరిక తీరిందంటున్న సమంత !

కోరిక తీరిందంటున్న సమంత !

స్టార్ హీరోయిన్లలో సమంత పంథానే వేరు.  ఆమె ఎంచుకునే కథలు, పాత్రలు చాలా భిన్నంగా ఉంటాయి.  ఇప్పటికే 'రంగస్థలం, మహానటి, మజిలీ' సినిమాలతో మెప్పించిన ఆమె తాజాగా 'ఓ బేబీ' అనే సినిమా చేసింది.  ఇప్పటికే విడుదలైన టీజర్ బాగా ఆకట్టుకోగా సినిమా కూడా అదే స్థాయిలో విందాత్మకంగా ఉంటుందని చెబుతోంది ఈ అక్కినేని కోడలు.  అంతేకాదు ఈ సినిమాతో పూర్తిస్థాయి హాస్యభరిత చిత్రం చేయాలన్న తన కోరిక కూడా నెరవేరిందని చెప్పుకొచ్చింది.  నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జూలై 5న విడుదలకానుంది.