కొరియన్ సినిమా రీమేక్ లో సమంత !

కొరియన్ సినిమా రీమేక్ లో సమంత !

కేవలం స్టార్ హీరోల సినిమాలకే పరిమితం కాకుండా కథా బలమున్న సినిమాలని, లేడీ ఓరియెంటెడ్ కథలని చేస్తున్న సమంత త్వరలో 'యు టర్న్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకురానున్నారు.  భవిష్యత్తులో ఆమె చేయబోయే సినిమాల్లో కొరియన్ చిత్రం 'మిస్ గ్రానీ' తెలుగు రీమేక్ కూడా ఒకటి. 

ఈ చిత్రంలో సమంత 70 ఏళ్ల వృద్ధురాలి పాత్రలో కనించనుంది.  ఈ సినిమాను నందిని రెడ్డి డైరెక్ట్ చేయనున్నారు.  సునీత తాటితో కలిసి సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.  సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఇతర నటీనటులెవరు వంటి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.