సమంత ఎంతటి అదృష్టవంతురాలంటే..!

సమంత ఎంతటి అదృష్టవంతురాలంటే..!

సినిమా అంటేనే గ్లామర్.  గ్లామర్ ఉన్నంతవరకే సినిమా ఇండస్ట్రీలో వెలుగుతారు.  గ్లామర్ తగ్గేకొలది అవకాశాలు కూడా తగ్గిపోతుంటాయి.  ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో.  తక్కువ వయసు ఉన్నప్పుడే హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తుంటారు.  30 లేదా 35 వచ్చే సరికి హీరోయిన్లుగా రాణించలేరు.  అవకాశాలు తగ్గుముఖం పడతాయి.  దీంతో హీరోయిన్లు పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవుతుంటారు.  కానీ, కొంతమంది విషయంలో ఇది పూర్తిగా విరుద్ధంగా జరుగుతుంటుంది.  అందుకు ఒక ఉదాహరణ సమంత అని చెప్పొచ్చు.  

ఏం మాయ చేశావే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.  వరస విజయాలతో దూసుకుపోయింది.  అనతికాలంలోనే స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.  ఈ క్రమంలోనే తన మొదటి కోస్టార్ నాగచైత్యన్యతో ప్రేమలో పడింది.  ఇద్దరి కెరీర్ టాప్ పొజిషన్లో ఉండగానే వివాహం చేసుకున్నారు.  అక్కినేని కోడలుగా నాగార్జున ఇంట్లో అడుగుపెట్టింది.  

సాధారణంగా హీరోయిన్లు అవకాశాలు తగ్గిపోయినప్పుడు వివాహం చేసుకుంటారు.  సమంత మాత్రం అలా కాదు.  మంచి అవకాశాలు ఉండగానే వివాహం చేసుకుంది.  అంతేకాదు వివాహం తరువాత కూడా సినిమాల్లో నటిస్తారని ముందే చెప్పింది.  పెళ్లి తరువాత ఆమె నటించిన సినిమాలు వరసగా హిట్ అయ్యాయి.  మెర్సల్, రంగస్థలం, మహానటి, అభిమన్యుడు ఇలా వరస హిట్స్ తో సమంత దూసుకుపోతున్నది.  ఇక్కడితో ఆగలేదు.  మరికొన్ని సినిమాలకు కూడా సమంత సైన్ చేసింది.  

ఒకవైపు కుటుంబాన్ని చూసుకుంటూనే.. మరోవైపు సినిమాల్లో నటించడం అంటే చాలా కష్టమైనా పనే.  అయినప్పటికీ ఇష్టమైన రంగంలో ఎంతటి కష్టమైనా చిన్నదే అవుతుందని సమంత నిరూపిస్తోంది.  భర్త నాగచైతన్య, మామ నాగార్జునల సహకారంతోనే ఇది సాధ్యం అవుతుందని అంటోంది సమంత.  ఇక, మంచి స్క్రిప్ట్ దొరికితే భర్త, మామ, అఖిల్ తో కలిసి సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా సమంత తెలిపింది.  మరి సమంత కోరిక నెరవేరుతుందా..? మనం లాంటి మంచి స్క్రిప్ట్ దొరికితే మరోసారి తప్పకుండా అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి నటిస్తారు.  మరి అలాంటి స్క్రిప్ట్ ఎప్పుడు దొరుకుతుందో మరి.