యూటర్న్ థీమ్ డ్యాన్స్ కు సమంత ఫిదా..!!

యూటర్న్ థీమ్ డ్యాన్స్ కు సమంత ఫిదా..!!

యూటర్న్ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో..వెరైటీ వెరైటీ గా ప్రమోషన్స్ చేస్తూ.. టీం బిజీగా ఉన్నది.  ఇందులో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ యూటర్న్ కోసం ఓ థీమ్ సాంగ్ ను రూపొందించారు.  ఇప్పుడు యూటర్న్ థీమ్ డ్యాన్స్ పేరుతో ఓ ఛాలెంజ్ క్రియేట్ అయింది.  యుటర్న్ కర్మ థీమ్ మ్యూజిక్ ప్లే అవుతుండగా డ్యాన్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు.  అమెరికాలోని డెన్వర్ ప్రాంతానికి చెందిన కొంతమంది బాలికలు ఈ థీమ్ మ్యూజిక్ కు డ్యాన్స్ చేసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.  ఈ వీడియోను చూసిన సమంత లవ్లీ అంటూ రిప్లై ఇచ్చింది.  ఇప్పుడు ఈ డ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.