సమంత జోష్ మాములుగా లేదు..!!

సమంత జోష్ మాములుగా లేదు..!!

సమంత హీరోయిన్ గా చేస్తున్న ఓ బేబీ మూవీ జులై 5 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ సినిమాకు పోటీగా పెద్ద సినిమాలు ఏవి లేకపోవడంతో సంచలన విజయం సాధించడం ఖాయం అని అంటున్నారు సినీ విశ్లేషకులు.  

పెద్ద హీరోల సినిమాలతో సమానంగా సమంత ఓ బేబీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, విజయవాడలో ఈ కటౌట్ లు ఆకర్షణీయంగా మారాయి.  సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను రెండు రాష్ట్రాల్లో సొంతంగా రిలీజ్ చేస్తున్నది.  థియేట్రికల్ రైట్స్ కాకుండా నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో ఇప్పటికే ఈ మూవీ రూ. 10 కోట్ల రూపాయలకు పైగా ఆర్జించింది.  ఇదే పాజిటివ్ వైబ్ సినిమాకు కంటిన్యూ అయితే.. సినిమా నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోతుంది అనడంలో సందేహం లేదు.