సమంత ఓ బేబీ రిలీజ్ డేట్ ఫిక్స్...
మజిలీ వంటి సూపర్ హిట్ అందుకున్నాక సమంత చేస్తున్న సినిమా ఓ బేబీ. ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. సమంత సందడి సినిమాలో మాములుగా ఉండదు అన్నట్టుగా ఉంటుంది. 70 సంవత్సరాల మహిళ 20 ఏళ్ల యువతిగా మారితే ఎలా ఉంటుందో సినిమాలో చూపించబోతున్నారు.
టీజర్, సాంగ్ అన్ని బాగున్నయి. సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం జులై 5 వ తేదీన ఓ బేబీ సినిమాను రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తోంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)