కొడుకు మనవడితో సమంత సందడి

కొడుకు మనవడితో సమంత సందడి

సమంతకు పెళ్లయింది మొన్ననే కదా తెలియకుండా కొడుకు ఎప్పుడు పుట్టాడు.. ఆ కొడుక్కి మనవడు ఎప్పుడు పుట్టాడు. ఈ డౌట్ రావడం సహజమే.  నిజమే కదా అని ఆశ్చర్యపోకండి... అక్కడికే వస్తున్నా... ఇది రియల్ లైఫ్ లో కాదు... రీల్ లైఫ్ లో.  సమంత ఓ బేబీ సినిమా చేస్తోంది కదా.  అందులో 70 సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయి 20 సంవత్సరాల యువతిగా కనిపించబోతున్నది.  

ఆమెకు ఒక కొడుకు, మనవడు ఉంటాడు.  ఆ మనవడు కూడా పెళ్లి వయసుకు వస్తాడు.  అంతేకాదు.. ఆమెకు ఓ ఫ్రెండ్ కూడా ఉంటాడు.  వీళ్లంతా కలిసి ఒకే ఫ్రేమ్ లో ఉండటం విశేషం.  ఆ ఫ్రేమ్ కు సంబంధించిన ఫోటోను ఈరోజు సమంత సోసిల్ మీడియాలో పోస్ట్ చేసింది.  ఈ పోస్టర్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నది.  నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జులై 5 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.