సమంత మళ్ళీ బిజీ అయిందిగా..!!

సమంత మళ్ళీ బిజీ అయిందిగా..!!

గతేడాది వరసగా హిట్స్ అందుకున్న హీరోయిన్ సమంత.  ఈ ఏడాది మజిలీ తో తిరిగి తన హవా కొనసాగించేందుకు సిద్ధమైంది.  భర్త నాగచైతన్యతో నటిస్తూనే.. బయటి హీరోలతో కూడా సినిమాలు చేసేందుకు సిద్ధమైంది.  తమిళంలో సూపర్ హిట్టైన 96 సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.  ఈ రీమేక్ లో సమంతను హీరోయిన్ గా తీసుకున్నారు.  

ఇదిలా ఉంటె, బెల్లంకొండ హీరో శ్రీనివాస్ సీత తరువాత ఓ కొత్త సినిమా చేయబోతున్నాడు.  ఆర్ఎక్స్ 100 సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న అజయ్ భూపతి దర్శకత్వంలో సినిమా తెరకెక్కబోతున్నది.  ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుందట.  ఇందులో సమంతను హీరోయిన్ గా తీసుకుంటున్నారని తెలుస్తోంది.  సమంత కూడా ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్టు సమాచారం.  వీటితో పాటు సమంత మరికొన్ని ప్రాజెక్ట్స్ ను చేసేందుకు సిద్ధం అయ్యింది.