వెంకిమామ సినిమాలో సమంత రోల్

వెంకిమామ సినిమాలో సమంత రోల్

వెంకిమామ సినిమా షూటింగ్ శెరవేగంగా జరుగుతున్నది.  ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్ లో అద్భుతంగా జరుగుతున్నది.  సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  ఇదిలా ఉంటె, ఈ సినిమా గురించిన ఓ ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది.  సమంత సడెన్ గా కాశ్మీర్ లో ల్యాండ్ అయ్యింది.  తన పర్సనల్ మేకప్ మెన్, డిజైనర్ తో సహా అక్కడ వాలిపోయింది. 

అలా అక్కడ వాలిపోవడానికి కారణం ఏంటో తెలియడం లేదు.  బహుశా వెంకిమామ సినిమాలో సమంత ఏమైనా రోల్ చేస్తుందా అనే సందేహాలు కలుగుతున్నాయి.  సమంత నాగచైతన్యలు నటించిన మనం సినిమా కుటుంబ సినిమాగా హిట్ అయ్యింది.  ఆ తరువాత చై తో చేసిన మజిలీ ఓ రేంజ్ లో హిట్ కొట్టింది.  ఈ రెండు సినిమాల తరువాత సమంత... అక్కినేని కుటుంబంతో కలిసి సినిమా చేస్తే తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం రావాడంతో మామ నాగార్జున మన్మధుడు 2 లో స్పెషల్ క్యామియో రోల్ చేసింది.  ఇప్పుడు వెంకిమామలో కూడా సమంత ఓ రోల్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.