ముద్దుపై సమంత స్పందన ఇది

ముద్దుపై సమంత స్పందన ఇది

నాగచైతన్య.. సమంత జంటగా నటిస్తున్న మజిలీ సినిమా ఏప్రిల్ 5 వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాను భార్యాభర్తలైన నాగచైతన్య, సమంతలు ప్రమోట్ చేస్తున్నారు.  కాగా, ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజైన సంగతి తెలిసిందే.  ఈ టీజర్ లో సెకండ్ హీరోయిన్ దివాంశ కౌశిక్ .. నాగచైతన్యల మధ్య ఓ ముద్దు సీన్ ఉంది.  ఇప్పటి వరకు సినిమాల్లో నాగచైతన్య ఇలాంటి కిస్ సీన్స్ లో నటించలేదు.  

ఈ ముద్దు సీన్ పై నెటిజన్లు అడిగిన ప్రశ్నకు ఘాటైన సమాధానం ఇచ్చింది సమంత.  ఇది కేవలం సినిమా మాత్రమే అని.. సినిమా డిమాండ్ మేరకు హగ్, ముద్దు సీన్లు ఉంటాయని.. వాటిల్లో నటించక తప్పదని, కేవలం ఇది నటన మాత్రమే అని సమాధానం చెప్పింది.  నాగచైతన్యకు తనకు బలమైన మ్యారేజ్ రిలేషన్ ఉందని చెప్పింది సమంత.