నా సినిమా ప్రతి ఒక్క మహిళ చూడాలి : సమంత

నా సినిమా ప్రతి ఒక్క మహిళ చూడాలి : సమంత

 

స్టార్ హీరోయిన్ సమంత నటించిన కొత్త చిత్రం 'ఓ బేబీ'.  నందిని రెడ్డి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా జూలై 5న విడుదలకు రెడీ అవుతోంది.  ఇటీవలే రిలీజైన ట్రైలర్ బాగుండటంతో ఫ్యామిలీ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి బాగా పెరిగింది.  చిత్రం గురించి మాట్లాడిన సమంత ఇది కేవలం కామెడీ నిండిన సినిమా మాత్రమే కాదని, చాలా ప్రత్యేకమైన సినిమా అని అన్నారు.  ప్రతి మహిళ తన కుటుంబంతో కలిసి థియేటర్ కు వచ్చి చిత్రాన్ని చూడాలని విజ్ఞప్తి చేశారు.  సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రంలో నాగ శౌర్య ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు.