మనసులోని కోరికను బయటపెట్టిన సమంత

మనసులోని కోరికను బయటపెట్టిన సమంత

స్టార్ హీరోయిన్ సమంత వరుస విజయాలతో దూసుకుపోతోంది.  ఈ ఏడాది 'మజిలీ'తో పాటు తాజాగా చేసిన 'ఓ బేబీ' కూడా భారీ హిట్టవ్వడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు.  అక్కినేని అభిమానులు సైతం సమంత సాధిస్తున్న విజయాల పట్ల చాలా సంతృప్తిగా ఉన్నారు.  ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ తనకు మణిరత్నం, శేఖర్ కమ్ముల సినిమాల్లో నటించాలని ఉందని మనసులో మాటను బయటపెట్టింది.  

దేశంలో ఉన్న ఏ నటి అయినా మణిరత్నంగారి దర్శకత్వంలో నటించాలని అనుకుంటారని, అలాగే తనకు కూడా ఆ కోరిక ఉందని అంటూ శేఖర్ కమ్ముల సైతం హీరోయిన్లకు మంచి పాత్రలు, కథలు రాస్తారనే నమ్మకం తనకుందని చెప్పుకొచ్చింది.