సామ్ చెప్పిన ఎస్కేప్ ర‌హ‌స్యం

సామ్ చెప్పిన ఎస్కేప్ ర‌హ‌స్యం

అందాల స‌మంత కెరీర్ ప్ర‌స్తుతం జెట్‌స్పీడ్‌తో దూసుకెళుతోంది. పెళ్ల‌యిన త‌ర‌వాత త‌న స్టార్‌డ‌మ్ మ‌రో స్థాయికి వెళ్ల‌డంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. రంగ‌స్థ‌లం, మ‌హాన‌టి, అభిమ‌న్యుడు (ఇరుంబు తిరై) చిత్రాలు ఘ‌న‌విజ‌యం సాధించాయి. ఈ సినిమాల్లో స‌మంత న‌ట‌న‌కు జాతీయ స్థాయి అవార్డు రావడం ఖాయం అన్న చ‌ర్చ సాగుతోంది. ఇటీవ‌లే `మ‌హాన‌టి` చిత్రంలో సావిత్రి జీవితంపై ప‌రిశోధించే జ‌ర్న‌లిస్టు మ‌ధుర‌వాణిగా అద్భుతంగా న‌టించారు సామ్‌. 

ఇక‌పోతే ఓ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మంలో స‌మంత త‌న గ‌త ల‌వ్ లైఫ్ గురించి చేసిన వ్యాఖ్య ప్ర‌స్తుతం హాట్ టాపిక్ అయ్యింది. కెరీర్ ప‌య‌నంలో ఓ హీరోతో ప్రేమ‌లో మునిగాన‌ని స‌మంత గుర్తు చేసుకున్నారు. అయితే అప్ప‌టికే పెళ్ల‌యిన‌ జెమిని గ‌ణేష‌న్‌ని ప్రేమించి సావిత్రి ఎన్ని ఇబ్బందులు ప‌డ్డారో.. అలానే త‌న లైఫ్ అయ్యేద‌ని, అయితే ఆ స‌న్నివేశం నుంచి తెలివిగా బ‌య‌ట‌ప‌డగ‌లిగాన‌ని స‌మంత అనడం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.