మిడిల్ ఫింగర్ చూపించిన సమంత !

మిడిల్ ఫింగర్ చూపించిన సమంత !

హీరోయిన్ సమంత తనకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటూ, ఏది చేయాలనిపిస్తే అదే చేస్తుంటుంది.  వ్యక్తిగత స్వేచ్ఛ ముఖ్యమని నమ్మే ఆమె ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోదు.  కానీ అప్పుడప్పుడు ఆ విమర్శలు శృతిమించితే మాత్రం గట్టిగా సమాధానం చెప్పకుండా వదలదు. 

అక్కినేని ఇంటి కోడలు అయ్యాక సమంతపై ప్రేక్షకుల దృష్టి ఎక్కువగా ఉండటం సహజం.  గతం కన్నా ఇప్పుడు ఆమె కదలికల్ని ఎక్కువగా గమిస్తుంటారంతా.  ఈ క్రమంలో కొందరు ఆమె డ్రెస్సింగ్ విషయంలో పలుసార్లు రియాక్ట్ అయిన సందర్భాలున్నాయి.  వాటికి సమంత కూడ గట్టిగానే సమాధానమిస్తూ వచ్చింది.  

ఈసారి కూడ ఇబిజా హాలీడేలో ఉన్న ఫోటోలను షేర్ చేసిందామె.  వాటిలోని ఒక ఫోటోలో బీచ్ డ్రెస్  వేసుకుని కనిపించింది.  వాటిని చూసిన కొందరు అతిగా స్పందిస్తూ మీరిప్పుడు అక్కినేని కోడలు, ఇలాంటి డ్రెస్ ఏంటి అంటూ ఉచిత సలహాలిచ్చే ప్రయత్నం చేయగా ఇంకొందరు అభిమానులు డ్రెస్ అనేది ఆమె వ్యక్తిగత వ్యవహారం.  ఆమెకు ఇష్టం వచ్చినట్లు ఉంటుంది అంటూ సపోర్ట్ చేశారు.  

సలహాలు మరీ శృతిమించడంతో స్పందించిన సమంత తన ఇన్స్టాగ్రమ్ స్టోరీలో పెళ్లి తరవాత నేనిలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పే వాళ్లందరికీ ఇదే సమాధానం అంటూ మిడిల్ ఫింగర్ ఉన్న బొమ్మను పోస్ట్ చేసి థాంక్యూ చెబుతూ ఘాటైన రిప్లై ఇచ్చింది.  మరి అభిమానమనే సాకుతో సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై ఇష్టం వచ్చినట్లు పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు పాస్ చేస్తే ఇలాంటి సమాధానాలే వస్తాయి.