సమంత కెరీర్లోనే బెస్ట్ అవుతుందట..!!!

సమంత కెరీర్లోనే బెస్ట్ అవుతుందట..!!!

సమంత కెరీర్లో ఎన్నో సినిమాలు చేసింది.  చాలా సినిమాలు సూపర్ హిట్టయ్యాయి.  రంగస్థలం వంటి సినిమాలో డిగ్లామరైజ్డ్ పాత్రలు చేసింది.  భర్త నాగచైతన్యతో కలిసి మొదటి సినిమా ఏం మాయ చేశావే, ఆ తరువాత చాలా సినిమాలు చేసింది.  మనం సినిమా మంచి హిట్.. ఇప్పుడు పెళ్లి తరువాత ఈ ఇద్దరు కలిసి మజిలీ చేస్తున్నారు.  

జీవితంలో ఓ వ్యక్తి సాధించాలనుకున్నది సాధించలేక.. ప్రేమలో విఫలమైన వ్యక్తి జీవితంలోకి భర్తే ప్రాణంగా భావించే అమ్మాయి భార్యగా వస్తే.. ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది.  ఆ వ్యక్తిని వివాహం చేసుకున్న అమ్మాయి జీవితం ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో శివ నిర్వాణ తెరకెక్కించిన సినిమా మజిలీ.  నాగచైతన్య ఇప్పటి వరకు చేయని పాత్రని ఈ సినిమాలో చేస్తున్నాడు.  చాలా కొత్తగా ఉంటుందట సినిమా.  సినిమాపై నమ్మకం ఉందని అంటోంది సమంత.  మరి సినిమా ఎలా ఉంటుందో.. నాగచైతన్య కెరీర్ను మరలా గాడిలో పెడుతుందో లేదో తెలియాలంటే ఏప్రిల్ 5 వరకు ఆగాల్సిందే.