మణికర్ణిక గురించి సమంత ఏమందంటే..

మణికర్ణిక గురించి సమంత ఏమందంటే..

మణికర్ణిక.. ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా.  క్రిష్ ఈ సినిమాను హ్యాండిల్ చేసినా.. కొన్ని కారణాల వలన సినిమానుంచి మధ్యలో తప్పుకున్నాడు.  ఆ తరువాత.. క్రిష్ వదిలేసిన బాధ్యతలను హీరోయిన్ కంగనా స్వీకరించి పూర్తి చేసింది.  ఈ సినిమాను చూసిన ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి పాత్రను ఎంపిక చేసుకొని చేయడానికి ధైర్యం కావాలని.. సాహసం చేసి విజయం సాధించిందని ప్రముఖులు ప్రశంసిస్తున్న సంగతి తెలిసిందే.  

ఈ లిస్ట్ లో ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్ సమంత కూడా చేరిపోయింది.  కంగనా గురించి అనేక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.  చారిత్రాత్మకమైన పాత్రను ఎంపిక చేసుకొని అందులో నటించాలంటే చాలా సాహసం కావాలని, అలాంటి సాహసం చేసి విజయం సాధించిన కంగన ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పింది.  సినిమాకు సరైన ప్రొమోషన్ లేకపోవడంతో కలెక్షన్లు తక్కువగా ఉన్నా.. సెలెబ్రిటీల ట్వీట్స్ తో సినిమా తప్పకుండా సూపర్ సక్సెస్ అవుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.