సమంత మళ్ళీ మళ్ళీ వెళ్తుందట.. తనకోసం కాదు..!!

సమంత మళ్ళీ మళ్ళీ వెళ్తుందట.. తనకోసం కాదు..!!

సమంత ఓ బేబీ ఈరోజు రిలీజ్ అయ్యింది.  పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.  తెలుగు రాష్ట్రాల్లో షోలు పడుతున్నాయి. మరికొద్ది సేపట్లో సినిమాకు సంబంధించిన పూర్తి సమాచారం వస్తుంది. ఈ సినిమాకు ముందు సమంత తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంది.  ఆ స్వామివారి దయవలన సినిమా హిట్ అయ్యిందని అనుకోవచ్చు.  అది సెంటిమెంట్ కావొచ్చు.  

గతంలో మజిలీ సినిమా సమయంలో కూడా సమంత తిరుమల వెళ్ళింది.  తిరుమలకు కాలినడక వెళ్ళింది.  మజిలీ హిట్ కొట్టింది.  ఇకపై కూడా తిరుమల వెళ్తానని, కాకపోతే తన సినిమా కోసం సమయం ఉంటె వెళ్తానని, చైతు సినిమా రిలీజ్ సమయంలో మాత్రం తప్పకుండా తిరుమల వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకుంటానని చెప్పింది సమంత.