సమంతను పోలీసులు పట్టుకున్న వేళ !

సమంతను పోలీసులు పట్టుకున్న వేళ !

సమంత.. ఎప్పుడూ సరదాగా ఉంటూ తమాషా మాటల్తో అందర్నీ నవ్విస్తూ ఉంటారు.  అది సెట్స్ లో అయినా, టీవీ షోల్లో అయినా, పార్టీల్లో అయినా.  తాజాగా సమంత కొన్నేళ్ల క్రితం పోలీసులకు తనకు మధ్యన జరిగిన ఒక సంఘటనను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 

సమంత ఇంటర్మీడియట్ చదువుతుండగా ఆమె తండ్రి ఆమెకు స్కూటీ కొనిచ్చారట.  కానీ  లైసెన్స్ లేకపోవడం మూలాన నివాసం ఉంటున్న పల్లవరం వీధుల్లోనే  నడపమని చెప్పారట ఆయన.  కానీ సమంత ఒకరోజు పల్లవరం దాటి మీనంబాక్కం విమానాశ్రయం వరకు వెళ్లిపోయిందట.   అంతే అక్కడ గస్తీ ఉన్న పోలీసులు ఆమెను ఆపి లైసెన్స్, ఇతర పత్రాలను చూపించమని అడిగారట.  అవేవీ లేకపోకవడంతో సమంత పోలీసుల్ని బ్రతిమిలాడటం మొదలుపెట్టారట.  అలా బ్రతిమాలిన కాసేపటికి పోలీసులు ఆమెను వెళ్లిపొమ్మన్నారట.  ఈ సరదా ఇన్సిడెంట్ ను షేర్ చేసుకుని తెగ నవ్వుకుంది సమంత.