రానా నిశ్చితార్ధం స్పెషల్ ఫోటో పోస్ట్ చేసిన సమంత...

రానా నిశ్చితార్ధం స్పెషల్ ఫోటో పోస్ట్ చేసిన సమంత...

టాలీవుడ్ టాల్ హీరో  రానా దగ్గుబాటి తన ప్రేమ వ్యవహారాన్ని ఓపెన్ గా చెప్పి టాలీవుడ్ కు ఒ షాకిచ్చారు. మిహిక బజాజ్ తో ప్రేమలో ఉన్న రానా తమ ఇద్దరి ప్రేమను ఇరు వైపులా అంగీకరించడంతో వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది. అయితే నిన్న రానా,మిహికా బజాజ్ నిశ్చితార్ధం జరిగింది.  దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు రానా నిశ్చితార్ధం కు సంబంధించిన ఓ స్పెషల్ ఫోటోను అక్కినేని వారి కోడలు సమంత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. "2020 లో బెస్ట్ న్యూస్ మాకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ.  రానా దగ్గుబాటి.. మిహికా బజాజ్ మీరు హ్యాపీగా ఉండాలి" అంటూ ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. అయితే సమంత పోస్ట్ చేసిన ఫొటోలో నాగ చైతన్య, సమంత తో పాటుగా ఎప్పుడు బయటి కనిపించని విక్టరీ వెంకటేష్ కుమారుడు అర్జున్ కూడా కనిపిస్తున్నాడు.