సమంత స్పీడ్ పెంచింది..!!

సమంత స్పీడ్ పెంచింది..!!

సమంత వివాహం తరువాత కూడా వరసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నది.  ఈ ఏడాది ఆమె చేసిన సినిమాలన్నీ హిట్ కొట్టాయి.  ఇప్పుడు మరో ప్రయోగాత్మక సినిమా ఓ బేబీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.  ఈ మూవీపై ఆశలు భారీగా ఉన్నాయి.  సినిమాకు ఎలాంటి హైప్ తీసుకురావాలో సమంతకు బాగా తెలుసు.  

అందుకే సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నది.  ప్రమోషన్స్ లో బిజీ అయ్యింది.  మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ దూసుకుపోతున్నది.  డిఫరెంట్ సినిమా కావడంతో ఆశలన్నీ సమంతాపైనే ఉన్నాయి.  జులై 5 వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఈరోజు ఉదయం 10 గంటలకు రిలీజ్ కాబోతున్నది.