టీడీపీ అభ్యర్థికి ఓటు వేయమంటున్న సమంత !

టీడీపీ అభ్యర్థికి ఓటు వేయమంటున్న సమంత !

స్టార్ హీరోయిన్, అక్కినేని వారి కోడలు సమంత టీడీపీ అభ్యర్థికి తన మద్దతు తెలిపారు.  రేపల్లె టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ కు ఓటు వేసి గెలిపించాలని, సైకిల్ గుర్తుకు ఓటు  వేయమని కోరారు.  సమంత ఉన్నట్టుండి ఇలా టీడీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయడంతో అందరూ షాకయ్యారు.  దీనిపై క్లారిటీ ఇచ్చిన సమంత ఆయన తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అని, తనకు మంచి స్నేహితురాలైన డాక్టర్ అనగాని మంజుల సోదరుడని, మంచి వ్యక్తని అందుకే సపోర్ట్ చేశానని క్లారిటీ ఇచ్చారు.