సమంత సంచలన నిర్ణయం తీసుకుందే..!!

సమంత సంచలన నిర్ణయం తీసుకుందే..!!

పెళ్లి తరువాత కూడా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సమంత.. ప్రస్తుతం భర్త నాగచైతన్య తో కలిసి మజిలీ సినిమా చేస్తున్నది.  పెళ్లి తరువాత భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న పొరపాట్లు ఏంటి అన్నది సినిమాలో చూపించబోతున్నారు.  చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.  ఈ సినిమా తరువాత శర్వానంద్ తో కలిసి తమిళంలో సూపర్ హిట్టైన 96 రీమేక్ లో నటించబోతున్నది.  

సమంత ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటుంది.  ఎన్ని ఆటంకాలు వచ్చినా.. తన నిర్ణయాన్ని మార్చుకోదు.  ఎప్పటిలాగే ఈ ఏడాది సమంత ఓ నిర్ణయం తీసుకుంది.  తన వల్ల ఏ ప్రాణికి ఎలాంటి అపాయం జరగకూడదని, మాంసాహారం నుంచి శాకాహారిగా మారుతున్నట్టు సమంత తెలిపింది.  సమంత తీసుకున్న నిర్ణయం పట్ల శాఖాహార ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.