సమంత జీవితాన్నే మార్చేసిన అవకాశం

సమంత జీవితాన్నే మార్చేసిన అవకాశం

ప్రస్తుతం పరిశ్రమలో స్టార్ హీరోయిన్ హోదాలో ఉన్న నటి సమంత.  ఈమె మొదటగా 'ఏ మాయ చేసావే' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.  అంతేకాదు ఈ సినిమా సమయంలోనే హీరో నాగ చైతన్యకు ఆమెకు నడుమ ప్రేమ చిగురించి పెళ్లి కూడా చేసుకున్నారు.  అందుకే ఈ సినిమా సమంతకు స్పెషల్. 

ఆ సినిమా వచ్చి ఈ రోజుకి 9 సంవత్సరాలు గడిచింది.  ఆ విషయాన్నే ప్రస్తావిస్తూ నిర్మాత మంజుల ఘట్టమనేని అంతా నిన్నే జరిగినట్టుంది అంటూ ట్వీట్ చేశారు.  దానికి సమాధానంగా సమంత నా జీవితాన్నే మార్చేసిన అవకాశం ఇచ్చినందుకు థాంక్స్ అన్నారు.