ఆ హిట్ సీక్వెల్ లో సమంత నటిస్తుందా.. ?

ఆ హిట్ సీక్వెల్ లో సమంత నటిస్తుందా.. ?

సమంతకు ఇది లక్కీ ఇయర్ అని చెప్పాలి.  ఆమె నటించిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.  రంగస్థలం సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. జర్నలిస్ట్ గా చేసిన మహానటి, డాక్టర్ రతీదేవిగా అభిమన్యుడిలో నటించింది.  ఈ మూడు మూడు రకాలైన పాత్రలు.  ఈ మూడింటిలో మెప్పించింది సమంత.  దీంతో అనేక అవకాశాలు వరసగా వస్తున్న అన్నింటిని పక్కన పెట్టి కొన్నింటిని మాత్రమే ఎంచుకొని నటిస్తున్నది.  ప్రస్తుతం తెలుగు, తమిళంలో రూపొందుతున్న యూ టర్న్ సినిమాలోనూ, అలాగే భర్త నాగచైతన్య తో కలిసి ఓ సినిమాలోను నటిస్తున్నది.  ఈ రెండు మినహా సమంత ఇప్పటి వరకు మరే కొత్త సినిమా ఒప్పుకోలేదు.  సమంత నటించిన సీమరాజ త్వరలోనే విడుదల కానున్నది.  

తమిళంలో సూపర్ హిట్టైన ఇరంబు తిరై సినిమాకు సీక్వెల్ చేయాలని విశాల్ అనుకుంటున్నారు.  అనుకోవడమే కాదు, దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా చకచకా జరుగుతున్నట్టు సమాచారం.  అభిమన్యుడులో డాక్టర్ రతీదేవి పాత్రలో మెప్పించిన సమంతను సీక్వెల్ లో నటించాల్సిందిగా విశాల్ యూనిట్ నుంచి కాల్ వచ్చిందట.  దీనిపై సమంత ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం.  పూర్తి స్క్రిప్ట్ పూర్తయ్యాక నచ్చితే... సమంత అందులో నటించేందుకు అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.  విశాల్ లాంటి పెద్ద హీరో అడిగితె సమంత కాదంటుందా.. ఏమో చెప్పలేం కదా.