మామయ్యా సినిమాలో అక్కినేని కోడలు

మామయ్యా సినిమాలో అక్కినేని కోడలు

నాగార్జున ఆల్ టైమ్ బెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మన్మథుడు సినిమాకు సీక్వెల్ గా మన్మథుడు 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  రీసెంట్ గా ఈ సినిమా ప్రారంభోత్సవం చేసుకుంది. ఇదిలా ఉంటె, ఇందులో అక్కినేని కోడలు సమంత ఓ కీలక రోల్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.  

ఒకవైపు హీరోయిన్ గా వరస హిట్స్ తో దూసుకుపోతూనే... ఇలా కీలక పాత్ర చేసేందుకు ఒప్పుకోడం అంటే మామూలు విషయం కాదు.  ఎలాగో మన్మథుడు 2 సినిమా సొంత సినిమానే.  మామయ్యా నాగ్ హీరో.  అలాగే రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తుండటంతో సమంత ఇందులో చేసేందుకు ఒకే చేసినట్టు తెలుస్తోంది.  

సమంత రోల్ సెకండ్ హాఫ్ లో ఉంటుందని, సినిమాకు కీలకంగా మారుతుందని అంటున్నారు.  సమంత రోల్ కు సంబంధించిన విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించాల్సి ఉంది.