నాగ చైతన్యకు సమంత షాక్
అక్కినేని కోడలు సమంత వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఈ ఏడాది 'మజిలీ'తో పాటు 'ఓ బేబీ' రూపంలో మరో హిట్ అందుకుంది. దీంతో అక్కినేని ఫ్యామిలీలో ఆమెకే ఎక్కువ సక్సెస్ రేట్ ఉంది. అంతేకాదు ఓవర్సీస్లో అయితే ఏకంగా తన భర్త, చైతన్యని బీట్ చేసేస్తోంది శామ్. నాగ చైతన్య చిత్రాల్లో అత్యధిక ఓవర్సీస్ వసూళ్లను సాధించిన చిత్రాల్లో 'ప్రేమమ్' మొత్తంగా 829,098 డాలర్లతో, ఇటీవలే విజయాన్ని అందుకున్న 'మజిలీ' 800,200 డాలర్లతో ముందున్నాయి. ఇక 'ఓ బేబీ' అయితే నిన్నటి వరకు 825,734 డాలర్లను కలెక్ట్ చేసింది. ఇంకో రెండు రోజుల్లో ఈ మొత్తం మిలియన్ దాటనుంది. అంటే ఓవర్సీస్ మార్కెట్లో సమంత నాగ చైతన్యను దాటేయనుందన్నమాట.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)