కాజల్ క్యారెక్టర్లో సమంత..!!?

కాజల్ క్యారెక్టర్లో సమంత..!!?

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తరువాత కాజల్ అగర్వాల్ టాలీవుడ్ లో చాలా బిజీ అయింది.  వరసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నది.  ఒకవైపు సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తూనే.. మరోవైపు యంగ్ హీరోలతో కూడా సినిమాలు చేస్తున్నది. ఇలా వరసగా సినిమా చేస్తున్న కాజల్ తీరికలేకుండా పోయింది. 

గతంలో యానిమేషన్ డైరెక్టర్ భార్గవ్ రావణుడి సోదరి శూర్పణఖ పాత్రను ప్రధానాంశంగా తీసుకొని ఓ సినిమా చేయాలని అనుకున్న సంగతి తెలిసిందే.  ఇందులో కాజల్ ను హీరోయిన్ గా అనుకున్నాడు.  కథ కూడా రెడీ అయింది.  కానీ, ఇప్పుడు కాజల్ బిజీగా మారిపోవడంతో ఈ సినిమా చేసేందుకు ఆమెకు సమయం దొరకడం లేదు.  దీంతో భార్గవ్ సమంత ను సంప్రదించినట్టుగా సమాచారం.  యూటర్న్ సినిమా తరువాత లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా సమంత చెప్పడంతో.. శూర్పణఖ సినిమాలో సమంత నటించే అవకాశం లేకపోలేదు.  ఎలాగో శూర్పణఖ చుట్టూనే కథ తిరుగుతుంది కాబట్టి సమంత తప్పకుండా ఒప్పుకునే అవకాశం ఉంది.