వెడ్డింగ్ డే స్పెషల్ ట్వీట్

వెడ్డింగ్ డే స్పెషల్ ట్వీట్

నాగ చైతన్య శైలజా రెడ్డి అల్లుడు, సమంత యూ టర్న్ సినిమాల విజయం తరువాత తన కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లి అక్కడ సక్సెస్ ను ఎంజాయ్ చేశారు.  విదేశాల్లో సక్సెస్ ఎంజాయ్ తరువాత సమంత తన కుటుంబ సభ్యులతో కలిసి తిరిగి ఇండియా వచ్చారు.  వెడ్డింగ్ డే సందర్భంగా సమంతకు, నాగ చైతన్యకు అనేక మంది శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేశారు.  ఇలా ట్వీట్ చేసిన అందరికి సమంత కృతఙ్ఞతలు తెలియజేసింది.  నాగ చైతన్యతో వివాహం తరువాత తాను చాలా సంతోషంగా ఉన్నానని, నాగ చైతన్య పక్కన ఉంటె తన ధైర్యంగా ఉంటుందని సమంత పేర్కొన్నది.  ఈ సందర్భంగా సమంత చేసిన ట్వీట్ అందరిని ఆకట్టుకుంటున్నది.