"ఆకాశమే నీ హద్దురా" మూవీపై ఆసక్తికర ట్వీట్‌ చేసిన సమంత  

"ఆకాశమే నీ హద్దురా" మూవీపై ఆసక్తికర ట్వీట్‌ చేసిన సమంత  

తమిళ స్టార్ హీరో సూర్య లీడ్ రోల్ లో సుధా కొంగర దర్శకత్వంలో ఆకాశమే నీ హద్దు రా అనే సినిమా మా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.  రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంటుంది. అయితే ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సూర్య నటన. ఈయన తన పాత్రలో నటించాడు అనడం కంటే జీవించాడు అని చెప్పచ్చు. ఇక అతనితో పాటు హీరోయిన్ గా నటించిన అపర్ణ బాలమురళి నటన గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించక తప్పదు. ఎందుకంటే ఆమె నటన తమిళ ప్రేక్షకులను మాత్రమే కాక తెలుగు ప్రేక్షకులు కూడా అబ్బురపరిచింది.  అయితే.. తాజాగా.. ఈ సినిమాపై సమంత ఆసక్తికర ట్వీట్‌ చేసింది. ఈ సినిమా యూనిట్‌ పై ప్రశంసల వర్షం కురిపించింది సమంత. " ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌. ఈ సినిమా ఓ ఆణిముత్యం. సుధా కొంగర డైరెక్షన్‌ అమేజింగ్. సూర్య, అపర్ణ యాక్టింగ్‌ అద్భుతం. నాకు అవసరమైన ప్రేరణ, స్ఫూర్తి ఈ సినిమాలో ఉన్నాయి" అని సమంత ట్వీట్‌ చేసింది.