సెప్టెంబర్ 13.. ముక్కోణ పోటీ..!!

సెప్టెంబర్ 13.. ముక్కోణ పోటీ..!!

సెప్టెంబర్ 13 వినాయక చవితి రోజున టాలీవుడ్ లో మూడు సినిమాలు పోటీ పడుతున్నాయి.  ఇప్పటికే రెండు సినిమాలు కన్ఫర్మ్ కాగా, మూడో సినిమాగా నాగచైతన్య శైలజా రెడ్డి అల్లుడు వచ్చి చేరింది. ఆగష్టు 31 న రిలీజ్ కావలసిన ఈ సినిమా కొన్ని కారణాల వలన అనుకోకుండా వాయిదా పడింది.  సెప్టెంబర్ 12 న యూఎస్ ప్రీమియర్ షో పోస్టర్స్ బయటకు రావడంతో సెప్టెంబర్ 13 న సినిమా విడుదల కావడం ఖాయంగా కనిపిస్తున్నది.  

అదే రోజున మరో రెండు సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి.  సమంత యూటర్న్, సుదీర్ బాబు నన్ను దోచుకుందువటే.  యూటర్న్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ కాగా, నన్నుదోచుకుందువటే ప్రేమకథా చిత్రం.  మూడో సినిమా శైలజా రెడ్డి అల్లుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్.  విచిత్రం ఏమిటంటే ఈ ముగ్గురు కలిసి ఏం మాయ చేశావే సినిమాలో నటించారు.  ఇప్పుడు ఈ ముగ్గురి మధ్య ఈ విధమైన పోటీ ఏర్పడింది.  మూడు వేరు వేరు జానర్లో వస్తున్న సినిమాలు కావడంతో ప్రేక్షకులు ఏ సినిమాను ఆదరిస్తారో చూడాలి.