సమంత సినిమా కంప్లీట్ !

సమంత సినిమా కంప్లీట్ !

స్టార్ హీరోయిన్ సమంత చేస్తున్న సినిమాల్లో 'ఓహ్ బేబీ' కూడా ఒకటి.  ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ తాజాగా ముగిసింది.  మొదలుపెట్టిన అతికొద్ది సమయంలోనే షూటింగ్ ముగించేశారు టీమ్.  ఈ సినిమాలో సమంత రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనుంది.  కొరియన్ చిత్రం 'మిస్ గ్రానీ' చిత్రానికిది రీమేక్.  ఈ ప్రయోగాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నిర్మిస్తున్నారు.