ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం..

ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం..

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా సంబంగి వెంకట చిన అప్పలనాయుడు ప్రమాణస్వీకారం చేశారు. వెలగపూడిలోని సచివాలయం మొదటి బ్లాక్‌లో సంబంగి వెంకట చిన అప్పలనాయుడుతో ప్రమాణస్వీకారం చేయించారు గవర్నర్ నరసింహన్. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. కాగా, బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు సంబంగి వెంకట చిన అప్పలనాయుడి.. ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించారు. ఇక ఈ నెల 12వ తేదీన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తరువాత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఆ తరువాత స్పీకర్ ఎన్నిక జరుగనుంది.