'అందుకే రవిప్రకాష్‌ను తొలగించాం'

'అందుకే రవిప్రకాష్‌ను తొలగించాం'

టీవీ9 సీఈవో, డైరెక్టర్‌ పదవి నుంచి రవిప్రకాష్‌ను తొలగిస్తూ ఇవాళ బోర్డు డైరెక్టర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని అలందా మీడియా డైరెక్టర్‌ ఎస్‌.సాంబశివరావు ప్రకటించారు. బోర్డు సభ్యులతో కలిసి ఇవాళ సాయంత్రం మీడియాతో మాట్లాడారు. డైరెక్టర్ల సమావేశం జరగకుండా రవిప్రకాష్‌ అడ్డుపడ్డారని, అందుకే తొలగించామని చెప్పారు. యజమాన్య మార్పిడి జరగకుండా రవిప్రకాష్, సీఎఫ్‌వో ఎంవీకేఎన్ మూర్తి ఎన్నో అవరోధాలు సృష్టించారని తెలిపారు. ఇకపై టీవీ9తో రవిప్రకాష్‌కు, మూర్తిలకు ఎలాంటి సంబంధంలేదని, వాళ్లిదరూ ఎవరితోనైనా ఆర్థిక లావాదేవీలు జరిపితే తమ సంస్థకు ఎలాంటి సంబంధం ఉండదని తేల్చిచెప్పారు. టీవీ9 సంస్థలలోకి కొత్తగా నలుగురు డైరెక్టర్లను తీసుకుంటున్నట్లు సాంబశివరావు వెల్లడించారు.