కాజల్ బాటలో సమీరా రెడ్డి కూడా...!!

కాజల్ బాటలో సమీరా రెడ్డి కూడా...!!

సినిమా రంగం అంటేనే గ్లామర్.  గ్లామర్ గా కనిపిస్తేనే సినిమాను చూస్తారు.  అందుకే సినిమాల్లో అందమైన హీరోయిన్లను తీసుకుంటారు. సినిమాల్లో హీరోయిన్లు ఎంతో అందంగా ఉంటారు.  బయట కూడా చాలా అందంగా కనిపిస్తారు.  ఆ అందంగా కనిపించే వెనుక అసలు రంగు ఏంటి అన్నది ఎవరికీ తెలియదు.  

రీసెంట్ గా కాజల్ తన అసలు రంగు ఇది అని బయటపెట్టింది.  దాన్ని చూసి అందరు షాక్ అయ్యారు.  కాజల్ అంటే చందమామ.  చందమామ చాలా అందంగా ఉంటుంది అనుకున్నారు.  ఇదే బాటలో సమీరా రెడ్డి కూడా పయనిస్తోంది.  సమీరా రెడ్డి తన అసలు రంగు ఇది అని చెప్పి బయటపెట్టింది.  అందంగా కనిపించేదంతా నిజం కాదు.  నిజమైన అందం అంటే ఇదే అని చెప్పి మేకప్ లేకుండా ఫోటోను పోస్ట్ చేసింది.  ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.