నిర్మాతలుగా మారుతున్న సమంత.. చైతన్య..!!

నిర్మాతలుగా మారుతున్న సమంత.. చైతన్య..!!

ఏం మాయ చేశావే, మనం, మజిలీ సినిమాలతో మంచి కొట్టారు సమంత, నాగ చైతన్యలు.  ఏ ఇద్దరి కాంబినేషన్లో మొత్తం నాలుగు సినిమాలు వస్తే అందులో మూడు మూడు సూపర్ హిట్ అయ్యాయి.  సమంత రీసెంట్ గా ఓ బేబీ సినిమా చేసింది.  ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా వసూళ్ల పరంగా దూసుకుపోతున్నది.  

నందిని రెడ్డితో మరో సినిమా చేసేందుకు సమంత సిద్ధం అయ్యినట్టు తెలుస్తోంది.  లేడీ ఓరియెంటెడ్ కథను సమంత కోసం నందిని రెడ్డి సిద్ధం చేస్తోందట.  ఈ మూవీకి సమంత, నాగ చైతన్యలు ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నారని తెలుస్తోంది.  కొత్త బ్యానర్ స్థాపించి నందిని రెడ్డితో సినిమా చేస్తారా లేదంటే.. అన్నపూర్ణలో చేస్తారా లేదంటే మనం మూవీస్ బ్యానర్లో చేస్తారా అన్నది తెలియాలి.