సమంత బ్యాగ్ లో ఇది తప్పనిసరి..!!

సమంత బ్యాగ్ లో ఇది తప్పనిసరి..!!

సమంత టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఇప్పటికి చలామణి అవుతున్నది.  వివాహం తరువాత కూడా వరసగా సినిమాలు చేసింది సమంత.  పెళ్లి తరువాత లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ విజయాలు సాధిస్తున్న సమంత ... ఓ బేబీ సినిమా తరువాత మరో సినిమా ప్రకటించలేదు.  ఓ వెబ్ సీరీస్ చేస్తున్నట్టు సమాచారం.  వెబ్ సిరీస్ చేస్తుండటం సినిమా చేయలేదని అంటున్నారు.  

ఇక ఫిట్నెస్ విషయంలో సమంత చాలా కేర్ తీసుకుంటారు. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు.  ఎంత వర్క్ ఉన్నా సరే ఉదయాన్నే 5 గంటలకు నిద్రలేచి జిమ్ కు వెళ్తుంది.  15 నిముషాలు ముందుగానే సమంత జిమ్ లో ఉంటుందట.  ఇక బయటకు వెళ్లే సమయంలో సామ్ తనతో పాటు బ్యాగ్ లో సన్ స్క్రీన్ లోషన్ తప్పనిసరిగా తీసుకెళ్తుందట.  సన్ స్క్రీన్ లోషన్ లేకుండా బయటకు అడుగు పెట్టదట సమంత.